ఏ అర్హతతో పవన్ కళ్యాణ్ కి నోటీసులు ఇచ్చారు..? – వంగలపూడి అనిత

-

విశాఖ: వైసీపీ ఆత్మగౌరవ దినంకు పోటీగా టీడీపీ ఆత్మగౌరవ దీక్ష చేపట్టనుంది. రేపు విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర తెలుగు మహిళలు ఆత్మగౌరవ దీక్ష చేపట్టనున్నారు. మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలతో చేపట్టే దీక్ష నేపథ్యంలో గురువారం పోస్టర్ రిలీజ్ చేశారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోం మంత్రులుగా దళిత మహిళలు ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మా హోంమంత్రి కనిపించడం లేదు, వినిపించడం లేదని డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇక పదవిని కాపాడుకోవడానికి వాసిరెడ్డి పద్మ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఊడిపోయిన పోస్టును అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కి నోటీసులు ఇస్తావా.. అందుకు నీకున్న అర్హత ఏంటి…? అని ప్రశ్నించారు. ప్రతీ శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినాలు జరపడం విడ్డురంగా ఉందన్నారు అనిత. అమరావతి మహిళా రైతుల చీరలు, డ్రెస్సింగ్ గురించి హేళన చేసిన వాళ్లపై వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అభ్యంతరం చెబితే దిష్టిబొమ్మలు, ఫ్లేక్సీలు దగ్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news