అంబేద్కర్ కోనసీమ: కాట్రేనికోన మండలం చిర్రయానంలో సముద్రం 100 మీటర్లు ముందుకు వచ్చింది. తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారుల బోట్లు ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.
అధికారుల హెచ్చరికలతో మత్స్యకారుల బోట్లు ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుతున్నాయి. యానాం దగ్గర గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. ముమ్మిడివరం పరిధిలోని గురజాపులంక, ఠాణేలంక, కూనాలంక, గేదెల్లంక, పశువుల్లంక, కన్నపులంక, పొగాకులంక, ఎదుర్లంక, గోగుల్లంక గ్రామాలకు వరదముప్పు పొంచి ఉంది. దీంతో తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.