గాంధీజీ వారానికి ఒకరోజు మౌనవ్రతం పాటించేవారట.. ఎందుకంటే..

-

ఈరోజు గాంధీ జయంతి. మహాత్మా గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. గాంధీజీ తన జీవనశైలిలో ఎన్నో నియమాలు పాటించేవాళ్లు, తినే ఆహారం, పాటించే పద్ధతులు అన్నీ భిన్నంగా ఉండేవి. వారంలో ఒకరోజు కచ్చితంగా మౌనంగా ఉండేవాళ్లట. వారానికి ఒకసారి ఉపవాసం చేయమంటే చేస్తాం కానీ వారం వారం మౌనదీక్ష అంటే చేయగలుగుతారా..? అనుకుంటున్నారా..? వారానికి ఒకసారి మౌనంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!

మహాత్మా గాంధీ ప్రతి సోమవారం మౌనం పాటించేవారు. ఆ సమయంలో ఆయన మాట్లాడరు. చాలా ముఖ్యమైన విషయం ఉన్నప్పుడు, అతను తన ఆలోచనలను రాసి ఇతరులకు తెలియజేస్తారు. మౌన వ్రతం రోజున ప్రార్థనలు చేసి, పుస్తకం చదివి, వారంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేవారు. అహింస విధానాన్ని అభివృద్ధి చేయడంలో ఇది కూడా ఆయనకు ఉపయోగపడింది.

మౌనం, విలువ చాలా గొప్పది. మనం నిరంతరం మాట్లాడితే మన అంతర్గత స్వరం ఎప్పుడూ వినలేమని ఆయన చెప్పేవారు. దీని అర్థం ఒక వ్యక్తి తక్కువ మాట్లాడినట్లయితే, అతని ప్రతి పదానికి విలువ కలిగి ఉంటుంది. మౌనం వహించడం ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటే సగం సమస్యలు పరిష్కారమవుతాయి.

mahathma-gandhi

కొందరికి తరచూ కోపం వస్తుంది. ఆవేశంతో ఏదైనా పనులు చేస్తుంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తే, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి మౌన వ్రతం చాలా మంచి పద్ధతి. మీరు మీతో మౌనంగా గడిపినప్పుడు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఒంటరిగా, కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నప్పుడు మెదడు మీ భావోద్వేగాలను మెరుగైన స్థాయిలో ప్రాసెస్ చేస్తుందట. ఆ సమయంలో పరిస్థితులు, వ్యక్తుల నుంచి మీపై ఒత్తిడి ఉండదు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీ భావోద్వేగాలను ఎలా కంట్రోల్‌ చేయాలో కూడా నేర్చుకోవచ్చు.

తెలివైనవాళ్లు ఎప్పుడూ తక్కువగానే మాట్లాడతారు. జనాలకు తక్కువ అవైలబుల్‌గా ఉంటారు. పిలిస్తే పలికితే.. మనం చులకన అయిపోతాం. బిజీగా లేకున్నా ఉన్నట్లు ఉండాలి. అవసరమైనంత మాత్రమే మాట్లాడాలి. మానసిక శక్తిని ఆదా చేసేందుకు సైలెంట్ ఫాస్ట్ చాలా మంచి మార్గం. శక్తి వృథా కావడానికి అతి పెద్ద కారణం ఎక్కువగా మాట్లాడటం. మాట్లాడటం వల్ల చాలా శక్తి వృథా అవుతుంది. పనికిరాని, అర్థరహితమైన విషయాల గురించి మాట్లాడి రోజంతా మనం ఎంతగా అలసిపోతున్నామో మనకే తెలియదు. అందువల్ల మౌన వ్రతం పాటించడం ద్వారా శక్తిని ఆదా చేసుకోవచ్చు.

మౌన వ్రతం ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మౌనంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ దృష్టిని నిలబెడుతుంది. మీ ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచుతుంది. మౌన వ్రతం ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత వరకూ ఉండగలుగుతారో తెలుస్తుంది.!

Read more RELATED
Recommended to you

Latest news