KGF సిద్ధంగా ఉండు.. JGF వస్తున్నాడు – జగన్‌ పై పవన్‌ సెటైర్లు

-

KGF సిద్ధంగా ఉండు.. JGF వస్తున్నాడంటూ సీఎం జగన్‌ పై పవన్‌ సెటైర్లు వేశారు. తాజాగా సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘KGF సిద్ధంగా ఉండు, JGF వస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు.

ఏపీలో 47.17 టన్నుల బంగారు వనరులు ఉన్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రహ్లాద జోషి చెప్పిన వివరాలను ఉటంకిస్తూ… ‘YSRCP అడ్వెంచరర్స్ సమర్పించు… జగనన్నస్ గోల్డ్’ అనే టైటిల్ తో కార్టూన్ ను పోస్ట్ చేశారు. దీనికి ఇప్పుడు బంగారం వెతకడమే ఏకైక టాస్క్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఇక అటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గానికి అభినందనలు చెప్పారు పవన్ కళ్యాణ్. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు అన్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news