భక్తుల రక్షణ కోసం త్వరలో శాశ్వత పరిష్కారం చేపడతామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో పోల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ మరియు ల్యాబరేటరిని ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనం గా నామకరణం చేశారు. మొత్తం 16.50 కోట్లతో ఈ నూతన కార్యాలయ భవనం నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ….తిరుపతి లో సొంత భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది…సిఎం శ్రీ వైఎస్ జగన్ పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మార్పులు తెచ్చారని తెలిపారు. కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారు.. జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా 263.13 మిలియన్ మెగా వాట్ల విద్యుత్ వినియోగం పరిశ్రమల ఏర్పాటు కి నిదర్శనం అన్నారు. కర్రల వివాదం గురించి నాకు తెలియదు …వినలేదన్నారు. చిన్నారి లక్షితను చిరుతపులి చంపడం బాధకరమైన విషయమని.. గతంలో బాలుడ్ని చిరుత దాడి చేస్తే కాపాడుకున్నామని చెప్పారు. ఘటన జరిగింది టిటిడి పరిదిలోని అటవీ ప్రాంతంలో జరిగింది…టిటిడి ఇచ్చే నివేదిక ఆధారంగా అటవీశాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.