పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సెంథిల్ అరెస్టు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సెంథిల్ తాజాగా  అరెస్టు అయ్యాడు. కుప్పం కి చెందిన  వైసీపీ నేత, పెద్దిరెడ్డి కీలక అనుచరుడు సెంథిల్ కుమార్ అరెస్ట్ కావడంతో వైసీపీలో గుబులు పుడుతోంది. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రెస్కో చైర్మన్ పని చేశాడు సెంథిల్. రెస్కో పరిధిలో నిధుల గోల్ మాలగ వ్యవహారంలో సెంథిల్ అరెస్ట్ అయ్యాడు.

రెస్కోలో నిధుల గోల్మాల్ వ్యవహారంపై రెస్కో ఎండి సోమశేఖర్ ఫిర్యాదు పై కేసు నమోదు అయింది. రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ తో పాటు మాజీ ఎండి సుబ్రహ్మణ్యం, రెస్కో ఉద్యోగి మురుగేష్ పై కుప్పం పోలీస్ స్టేషన్ లో 420, 406, 468, 409 IPC red with 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తమిళనాడులో సెంథిల్ ను అరెస్టు చేసారు కుప్పం పోలీసులు. తమిళనాడు నుంచి ఏపీకి తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version