మీ జీతం రూ.30 వేల లోపే ఉంటే ఇలా చేయండి.. చాలా ఆదా చేసుకోవచ్చు..!

-

ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఆదా చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ జీతమైనా ఎక్కువ జీతమైనా కొంతైనా సేవ్ చేసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రావు. ధరలు నానాటికీ పెరుగుతుండడంతో సామాన్య ప్రజలపై భారం ఎక్కువ పడుతోంది. నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది నెలకు 20వేల నుంచి 30 వేల జీతంతో జీవనాన్ని గడుపుతున్నారు.

రూపాయి కూడా మిగిలిన పరిస్థితులు లేవు. పెరిగిన ధరలకు తోడు సరేనా ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వలన మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది భవిష్యత్తు కోసం రూపాయి కూడా పొదుపు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. 30 వేల లోపు జీతం వస్తున్నట్లయితే ఈ విషయాలని ఫాలో అవ్వండి. అప్పుడు కచ్చితంగా ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చు.

  • నెలకి 30,000 జీతం వస్తున్నప్పుడు అందులోంచి 15% పెట్టుబడి కోసం పక్కన పెట్టండి 6000 మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి.
  • 2000 రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరవచ్చు. ఆ ఖాతాలో 2000 చొప్పున పెడుతూ ఉంటే మంచిది జాతీయ పెన్షన్ పథకం లేదా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి నెలకు 4000 ఇన్వెస్ట్ చేయడం మంచిది.
  • వెయ్యి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు పెట్టండి. మీ వయసు తక్కువ ఉంటే కోటి వరకు బీమా లభిస్తుంది. మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది.
  • 1000 రూపాయలతో ఆరోగ్య బీమా కొనుగోలు చేయండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నవాళ్లు ఏ అలవాట్లు లేని వాళ్ళు 30 ఏళ్లలోపు ఉంటే ఫైవ్ ప్లస్ 95 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.
  • నెల నెలా పెట్టుబడి పెట్టడం వలన ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చేతికి వస్తుంది. దాని ద్వారా మీరు మీ లక్ష్యాలని నెరవేర్చుకోవచ్చు.
  • ఇన్సూరెన్స్ ఆరోగ్య భీమా మీకు ఆర్థిక రక్షణని కల్పిస్తాయి. మీ ఖర్చులు తగ్గించుకుని వాటితో పొదుపు చేయాలి.
  • ఏదైనా భూమి లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసుకుని ఈఎంఐ ద్వారా నెల నెల చెల్లిస్తూ ఉండొచ్చు. ఆదాయపు పన్ను పరిధిలోకి లేకుండా లోన్ తీసుకోవడమే మంచిది అని నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version