తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తాజాగా చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాల కారణంగా 9 మంది మరణించారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశామని తెలిపారు.
ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. సహాయక చర్యల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కీలక సూచన చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. వరద బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఏపీలో కొన్ని చోట్ల 43.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రిజర్వాయర్లు అన్ని పుల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రం కాకుండా చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. ఇలాంటి వరదలు వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకోనే విధంగా జాగ్రత్త పడతామని తెలిపారు. వరద బాధితులకు బియ్యంతో పాటు ఇతర సామాగ్రి అందజేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.