జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ కి కూలీకి తగ్గట్టు పనిచేయడమే తెలుసన్నారు. కిరాయి తీసుకున్నాడు కాబట్టే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాడన్నారు. పవన్ మాటలకు జనం నవ్వుకుంటున్నారని అన్నారు పేర్ని నాని. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్నాననే విషయాన్ని పవన్ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో టిడిపి – జనసేన రెండూ కలిసే పోటీ చేస్తాయని.. టిడిపి ఇన్చార్జిని పెట్టిన చోట జనసేన ఇన్చార్జిలను పెట్టబోమని చెప్పాలని అన్నారు. పవన్ కళ్యాణ్ 25 సీట్ల కంటే ఎక్కువ చెట్ల పోటీ చేయడని అందరికీ తెలుసన్నారు. జనసేన – టిడిపి కార్యకర్తలు ఎంతోమంది హత్యాయత్నం, గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు.