దమ్ముంటే కేసీఆర్‌ ను నిలదీయు – పవన్‌ కళ్యాణ్‌ పై పేర్ని నాని సీరియస్‌

-

పవన్ కళ్యాణ్ పై మరోసారి రెచ్చి పోయారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ నెలలో రెండు రోజులే కదా ఇక్కడ ఉండేదని.. మిగిలిన రోజులన్నీ తెలంగాణలోనే ఏడుస్తావ్ గా అంటూ ఫైర్‌ అయ్యారు. అలాంటప్పుడు… తెలంగాణ లో ఎందుకు ప్రశ్నించవు?? కేసీఆర్ ను ఎందుకు నిలదీయవు?? అని నిప్పులు చెరిగారు. నిలకడ లేని పవన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి?? అని ప్రశ్నించారు.

ధైర్యం ఉంటే మా ఉమ్మడి ప్రభుత్వం చేసిన పనులే మళ్ళీ చేస్తాం అని చెప్పండని.. చంద్రబాబు లో ఉన్న రాజకీయ నిబద్ధత కూడా పవన్‌కు లేదని వెల్లడించారు. కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ ఏం చేశాడు?? పవన్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయ్యింది?? అని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజశేఖరరెడ్డి కుటుంబానికి, సీమ బలిజలకు విడదీయరాని అనుబంధం ఉందని… చంద్రబాబు కోసం జగన్ పై పవన్ విషం చిమ్ముతున్నాడని ఆగ్రహించారు. హరిరామజోగయ్య ఇంటికి వైఎస్సార్ కాంగ్రెస్ గూండాలను పంపించారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు.. అదే నిజం అయితే హరిరామజోగయ్య వైసీపీ లో ఎందుకు చేరారు?? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news