ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తాయని కేంద్రం ప్రకటించింది. పీఎం కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ తప్పనిసరి చేసిందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6.47 లక్షల రికార్డులకు ఈ-కేవైసీ పూర్తి చేయించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను CS జవహర్ రెడ్డి ఆదేశించారు.
రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ-కేవైసీని ఆధార్ లింక్ అయిన మొబైల్ OTP లేదా బయోమెట్రిక్ ఫేస్ అథేంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. కాగా, AP లోని సిద్దేశ్వరం, TS లోని సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే సంస్థ రూపొందించిన DPR ను… కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది. వంతెన నిర్మాణం, పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.1,519 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.436.91 కోట్లు కేటాయించింది.