కృష్ణా నదిపై తీగల వంతెనకు కేంద్రం ఆమోదం

-

ఏపీకి మరో శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. AP లోని సిద్దేశ్వరం, TS లోని సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే సంస్థ రూపొందించిన DPR ను… కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది. వంతెన నిర్మాణం, పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.1,519 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.436.91 కోట్లు కేటాయించింది.

కాగా, ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తిరుమలలో 800 కిలోవాట్ల పవన్ విద్యుత్ టర్బైన్ ను ఉచితంగా ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఏటా రూ. 90 లక్షల మేర విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని TTD అధికారులు తెలిపారు. తిరుమలలో ఏటా 4.5 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనిలో కోటి యూనిట్లు తిరుమలలో ఉన్న పవన విద్యుత్ ద్వారా సమకూరుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news