స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం

-

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం దాదాపు  1300రోజులు దాటింది. ఐక్య కార్యాచరణ సమితి దశలవారీగా పోరాటాన్ని విస్తరిస్తోంది. మరోవైపు, రాజకీయ పక్షాలకు ఈ వ్యవహారం సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? అనే చర్చ ప్రజల ముందుకు వస్తోంది. అదే సమయంలో ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయివేటీకరణ జరగబోదని పీలర్స్ ఇస్తూనే తెరచాటు వ్యవహారాలను చక చక పూర్తి చేసేస్తోంది. 2000 మందికి టిఆర్ఎస్ అమలు చేయాలని ఆలోచన., సీనియర్ ఉద్యోగులను నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులో జాప్యం వంటి వ్యవహారాలతో ఆందోళన రెట్టింపు అయ్యింది.

తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయించే కార్యక్రమం లాంఛనంగా బీచ్ రోడ్డులో ప్రారంభమైంది. ఉత్తరాంధ్రలో ప్రతీ కుటుంబం నుంచి ఒక పోస్ట్ కార్డు ప్రధాన మంత్రికి చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వీ.వీ. రమణమూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news