పర్చూరు ఎమ్మెల్యే సహా జిల్లా టీడీపీ నేతలకు కరోనా పొజిటివ్ !

ప్రకాశం జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు కరోనా పొజిటివ్ అని నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. ఒకే సారి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావులకు పాజిటివ్ అని తేలింది.

ఇందులో పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావు హైదరాబాద్ లో ప్రయివేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే ఏలూరి హోం ఐసోలేషన్ లో ఉన్నారు. వీరిని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు ఫోన్ లో పరామర్శించారు. ఇక జిల్లాలో 24 గంటల్లో 308 కరోనా కేసులు నమోదు.. మొత్తం 56,990కి కేసుల సంఖ్హ్య చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు మృతి చెందగా జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతులు 556 కి చేరింది. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్ లలో ప్రస్తుతం 3138 యాక్టివ్ కేసులు ఉన్నాయి.