వైసిపి ప్రభుత్వ హయాంలో తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని కేంద్రానికి చెప్పడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలో ఎన్డీఏకు ఎక్కువ బలం ఉందని.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నారని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ ని ఆపాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణకు ఎందుకు అడుగులు పడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు.