సంక్షేమం పేరుతో ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుందని బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రజా సమస్యలు గురించి గళమెత్తిన ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించాలని అన్నారు.
ఏపీలో కొంతమేరైనా అభివృద్ధి జరుగుతుందంటే మోడీ కారణం అని అన్నారు ప్రతి బీజేపీ కార్యకర్త కూడా జాతీయ స్థాయిలో బిజెపి చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పాలని అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందని అన్నారు సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్ముని దోచుకుంటుందని అన్నారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బిజెపి పోషిస్తుంది అని చెప్పారు సంక్షేమం పేరుతో ప్రభుత్వం పేదలు సొమ్మును దోచుకుంటుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పురందేశ్వరి అన్నారు.