ఈ వారంలో ప్రధాని నరేంద్ర మోడిని కలుస్తా- ఆర్ కృష్ణయ్య

ఈ వారంలో ప్రధాని నరేంద్ర మోడిని కలుస్తామని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నామని వెల్లడించారు ఆర్ కృష్ణయ్య. బిసి ప్రధానికి, బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడానికి ఏంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.

బిసిల కోసం ఆమలవుతున్న సంక్షేమ పథకాలను పర్యవేక్షణ చేసేందుకు బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని.. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం లేదని వివరించారు ఆర్ కృష్ణయ్య. పార్లమెంట్ లో బిసి బిల్ పెట్టాలని.. వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా మారారని కొనియాడారు ఆర్ కృష్ణయ్య.