రామోజీరావు ప్రాణాలకు ప్రమాదం ఉంది – RRR

-

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు గారిని సీఐడీ పోలీసులు విచారిస్తున్నప్పుడు ఆయన బెడ్ పై పడుకొని ఉన్న ఫోటో సాక్షి మీడియాలో, దినపత్రికలో ప్రచూరితమయిందని, ఆ ఫోటో ఎలా బయటకు వచ్చిందని, అసలు ఎవరు ఆ ఫోటో తీశారని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. తక్షణమే సీఐడీ ఎస్ పి అమిత్ గారిని సస్పెండ్ చేయాలని, సీఐడీనే అధికారికంగా ఆ ఫోటోను విడుదల చేసిందా?, ఒకవేళ సీఐడీ అధికారికంగా ఫోటోను విడుదల చేయకపోతే, బయట వ్యక్తులు విచారణ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళారా?, బయట వ్యక్తులు వెళ్ళారంటే రామోజీరావు గారి ప్రాణాలకు రక్షణ ఏది? అని ఆయన ప్రశ్నించారు.

82 ఏళ్ల వయోవృద్ధుడైన రామోజీరావు గారు బెడ్ పై పడుకొని ఉంటే ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, తనకు బాగా లేదని అబద్ధం చెబుతున్నారని సాక్షి మీడియా కథనాలను ప్రసారం చేసిందని, సీఐడీ పోలీసులు 6 గంటల పాటు ఆయన్ని విచారించగా, వైద్యుల సలహా మేరకు మధ్యలో రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ సీఐడీ పోలీసుల విచారణకు రామోజీరావు గారు సహకరించినట్లు ఈనాడు దినపత్రిక కథనములో వెల్లడించడం జరిగిందని అన్నారు. అవును డబ్బులు దారి మళ్లించాను అని రామోజీరావు గారు అంగీకరించినట్లుగా సాక్షి దినపత్రికలో రాసి, దాని పక్కనే చిన్నగా పరోక్షంగా అని రాయడం వెనుక మతలబు ఏమిటి అని, సీఐడీ రిపోర్టు సాక్షికి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు.

 

గతంలో ఇదేవిధంగా సీబీఐ విచారణ గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు రాస్తే బల్ల కింద నక్కి విన్నారా అని తమ పార్టీ వారు ప్రశ్నించిన విషయం తెలిసిందేనని, మరి ఇప్పుడు సాక్షి దినపత్రిక యజమాని అలాగే బల్ల కింద నక్కి ఏమైనా విన్నారా? అని ప్రశ్నించారు. ఈరోజు రామోజీరావు గారికి జరిగింది రేపు ఎవరికైనా జరుగవచ్చునని, ప్రజలంతా సంఘటితమై ఐక్యంగా ఈ విధానాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్ ను రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తోందని, రామోజీరావు గారి గురించి జుగుస్సాకరంగా రాయడానికి ఆ వెబ్సైట్ కు సిగ్గు లేదా అని అన్నారు. మళ్లీ సీఐడీ విచారణ అంటూ జరిగితే రామోజీరావు గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version