కోడి కత్తి కేసు నిందితుడు… జగన్‌ అభిమానే – ఎంపీ రఘురామ

-

కోడి కత్తి కేసు నిందితుడు… జగన్‌ అభిమానే అంటూ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి తమ పార్టీ పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందని రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు దోహదపడిన రెండు సంఘటనల్లో ఒకటి కోడి కత్తి డ్రామా అని, అభిమాని చేత భుజం మీద లైట్ గా గాయం చేయించుకొని జగన్ మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ ఎక్కారని, కానీ హైదరాబాదుకు చేరుకునే సరికి స్ట్రెచర్ పై పడుకొని ఆసుపత్రిలోకి వెళ్లి చికిత్స పొందారని అన్నారు.

ఈ కేసును విచారించిన ఎన్ ఐ ఏ, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా జగన్ మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యేందుకు నిరాకరించారని, ఈ సంఘటన వెనుక కుట్ర ఉందని, ఆ దిశగా విచారణ చేపట్టాలని కోరినప్పటికీ ఎన్ఐఏ నిరాకరించి ఆ పప్పులేమి ఉడకవని తేల్చి చెప్పిందని అన్నారు. తనని ఎవరో హత్యచేయాలనుకున్నారని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు చేశారని, కానీ ప్రభుత్వ పెద్దల ఎత్తు గడ చిత్తయిందని అన్నారు. ఈ విషయాన్ని రానున్న ఎన్నికల్లోనూ వాడుకోవాలనుకున్న తన ప్రస్తుత పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయిందని అన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి దోహద పడిన మరొక సంఘటన గొడ్డలి పోటు అని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని తమ పార్టీ నాయకులే వేయించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version