ఏపీలో 15 ఏళ్ల తర్వాత.. ఇళ్లను వదిలి వెళ్లాల్సిన దుస్థితి – వైసీపీ ఎంపీ

-

ఏపీలో 15 ఏళ్ల తర్వాత.. ఇళ్లను వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ప్రతి ఏటా 15% చెత్త పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న చెత్త ప్రభుత్వం జగన్‌ ది అని… రానున్న 15 ఏళ్ళు జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇంటి పన్ను కట్టలేక ఇళ్లను వదిలి వెళ్లాల్సిన దుస్థితి ప్రజలదంటూ ఎద్దేవా చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని, ప్రభుత్వ ధమనకాండను ప్రశ్నించిన వారిపై దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయని, కొండపి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ అనుచరుడి భార్యను తమ పార్టీ నాయకులు ట్రాక్టర్ పళ్ళతో దారుణంగా హత్య చేశారని, దళిత మహిళా హత్యపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం దారుణమని, జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఎర్నలిస్టులు తనపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ, లబ్ది పొందుతున్నారని, కనీసం తాము జర్నలిస్టులమనే సృహ ఉంటే, దళిత మహిళ దారుణ హత్యకాండ గురించి మాట్లాడాలని అన్నారు. ఒక కాకి చనిపోతే 100 కాకుల సమూహం మద్దతుగా నిలబడుతోందని, కానీ రాష్ట్రంలో దళిత మహిళను దారుణంగా హత్య చేసినప్పటికీ, స్పందించే వారే లేకపోవడం శోచనీయమని రఘురామకృష్ణ రాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news