తెలంగాణ ఎన్నికలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ…..’BRS గెలుపు కోసం నియోజకవర్గాలకు డబ్బు తరలింపునకు YCP MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్, KCR ఉపయోగించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/12/raghurama.webp)
అతను ప్రగతి భవన్ లో కూర్చొని గెలుపు స్థానాలపై సర్వే చేశారు. ఇది నిజమో కాదో ఆ పార్టీ నేతలు గుండెపై చేయి వేసుకొని చెప్పాలి. నాగార్జునసాగర్ వివాదాన్ని కూడా కావాలనే తెరపైకి తెచ్చారు’ అని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పాలకులతో పోలిస్తే తెలంగాణలోని కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అభివృద్ధిలోనే కాకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చక్కటి కృషి చేసిందని, అయినా ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత వల్ల తెలంగాణలో అధికార పార్టీ ఓటమిపాలయిందని తెలిపారు.