పంటలు దెబ్బతిన్నా…అడ్రస్ లేని ముఖ్యమంత్రి జగన్‌ – రఘురామ

-

పంటలు దెబ్బతిన్నా…అడ్రస్ లేని ముఖ్యమంత్రి జగన్‌ అని ఆగ్రహించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు  ఫైర్ అయ్యారు.  ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ నెలలో నూతనంగా నిర్దేశించుకున్న నాలుగైదు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అంతా ఏమవుతోంది? అని నిలదీశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జిడీపీ వృద్ధి అంతా ఉత్తదేనా?? అని, గత ప్రభుత్వ హయాంలో కంటే సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టింది లేదని, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి 1,80,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, చేసిన అప్పు కొండ లాగా పేరుకు పోతోందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లెర్ర చేసి, అప్పుల సంగతి తేల్చకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించాల్సి పరిస్థితి నెలకొంటుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

తాజాగా, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం, కాగ్ లు కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను అదే కార్పొరేషన్లకు లేఖ రాసి వివరాలను తెప్పించుకోవచ్చునని, అప్పుల వివరాలు చెప్పకపోతే తోలు ఊడిపోతుందని హెచ్చరికలు చేయవచ్చునని, అలా కాదనుకుంటే కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్ ను పరిశీలించవచ్చునని, రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పట్ల కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్టుగానే ఉంటున్నప్పటికీ, దారుణమైన ఉదాసీన వైఖరిని అవలంబిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news