సీఎం జగన్‌ ఓ ఇసుకాసురడు – వైసీపీ ఎంపీ

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు ఇసుకాసుర అనే పేరు పెట్టాలేమోనని ప్రజలు భావిస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. జేపీ అనే సంస్థకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టుని అప్పగించగా, మే 9వ తేదీనే ఆ కాంట్రాక్టు గడువు కాలం ముగిసిందని, ఆ సంస్థ కాంట్రాక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, అయినా టర్న్ కి అనే సంస్థ పేరిట రసీదులను కట్ చేస్తూ, జిల్లాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల అనధికారిక ప్రయివేట్ బిడ్ ద్వారా ఇసుక తవ్వకాలను కొంత మంది ప్రైవేటు వ్యక్తులు యదేచ్చగా కొనసాగిస్తున్నారని తెలిపారు.

ఇసుక తవ్వకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు ప్రతినెల 250 నుంచి 300 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆదాయం వెళ్తోందని, ప్రైవేట్ బిడ్ ఈ రేంజ్ లో ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఎన్ జి టి తో పాటు న్యాయస్థానాలలో కేసులు వేయగా, చిత్తూరు జిల్లాలోని 10 ఇసుక ర్యాంపులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకతవ్వకాలను ఆపాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ఎన్జీటీలో కేసు వేసిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, అయినా ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే గౌరవం లేదని, పోనీ జేపీ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ రెన్యువల్ చేశారా అంటే అది లేదని అన్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టతను ఇవ్వదని, ఇసుక అక్రమ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే… ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని ఎదురు దాడి చేస్తూ, చెత్త చెత్త మాటలను ప్రభుత్వ పెద్దలు మాట్లాడిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news