పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు… ప్రజా స్టార్ – వైసీపీ ఎంపీ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ కాదని, ప్రజా స్టార్ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అని ఎద్దేవా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అంటూ లేక, ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక… సలహాదారులు రాసిచ్చే స్క్రిప్టును జగన్ మోహన్ రెడ్డి గారు చదివి వినిపిస్తారని, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పెళ్ళిళ్ళకు, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు.

raghurama on pawan

ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి లేకుండా అవే మాటలు మాట్లాడుతుండడం చూస్తే విడ్డూరంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్యాకేజీ స్టారే అయితే, ఎవరినైనా కొనుగోలు చేసే స్తోమత జగన్ మోహన్ రెడ్డి గారికే ఉందని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కొనలేరని, ఎవరు కొనలేని వ్యక్తిత్వం ఆయన సొంతం అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు దోచుకున్న సొమ్ములో అర శాతం అయినా పెద్ద మొత్తమే అవుతుందని, ఎంతోమందిని డబ్బులతో మేనేజ్ చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయారని అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news