సాక్షి దినపత్రిక రాతలు రోతగా ఉన్నాయి – ఎంపీ రఘురామ

-

 

ముఖ్యమంత్రి జగన్‌ తో పాటు ప్రభుత్వ అధికారుల అవినీతిపై తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) గురించి సాక్షి దినపత్రికలో రాసిన రాతలు రోతగా ఉన్నాయని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారిపై వ్యక్తిగత కక్షతోనే తాను పిల్ దాఖలు చేసినట్లు, దీనికి విచారణ అర్హత లేదని సాక్షి దినపత్రికలో రాశారని, కౌంటర్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి గారి ఆకారాన్ని దూషించానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తన కౌంటర్ అఫిడవిట్లో ఫైల్ చేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కాకుండా, ముఖ్యమంత్రి గారు ఫైల్ చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఎప్పుడైనా సమస్యలను జటిలం చేయవద్దని తెలిపారు.

raghurama on pawan

పార్టీ అధ్యక్షుని హోదాలో చెప్పింది ముఖ్యమంత్రిగా అమలు చేయమని కోరానని అన్నారు. కొంతమంది చేత వ్యక్తిగతంగా తన గురించి పరుష పదజాలంతో మాట్లాడించినప్పుడు మాత్రమే, తాను కూడా పొట్టి వారు హిల్స్ వేసుకుంటారని చెప్పానని, ప్రజా సేవకు తాను అడ్డు వస్తున్నానని సాక్షి దినపత్రికలో రాశారని, అక్రమ మార్గంలో నాలుగు లక్షల సాక్షి దినపత్రిక కాపీలను అమ్ముకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలకు సింహభాగం భారతి సిమెంట్ ను విక్రయించడం ప్రజాసేవ ఎలా అవుతుందని అన్నారు. ఇదే విషయాన్ని పరిశోధించాలని మాత్రమే కోరుతూ పిల్ దాఖలు చేశానని, కోర్టులో ఉన్న అంశం గురించి తానుమాట్లాడడం లేదు… సాక్షి దినపత్రికలో రాసిన అడ్డగోలు రాతల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news