వచ్చే ఎన్నికల్లో వైసీపీ 4 ఎంపీలు, 25 అసెంబ్లీ స్థానాలకే పరిమితం – వైసీపీ ఎంపీ

-

రానున్న ఎన్నికల్లో 3 నుంచి 4 లోక్ సభ స్థానాలు, 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలకే నా ప్రస్తుత వైసీపీ పార్టీ పరిమితం కానుందని సంచలన పోస్ట్‌ పెట్టాడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అత్యంత దారుణంగా ఓటమిపాలవడం ఖాయమని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరించి వచ్చిన వాస్తవాలను ఆధారంగా, కొన్ని సర్వే ఏజెన్సీలతో మాట్లాడి చివరకు తాను ఒక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ నాడీ ఎలా ఉందో ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నెల, నెలన్నర రోజుల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి 24 నుంచి 25 స్థానాలు వస్తాయని టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల దినపత్రిక సర్వే ఫలితాలను వెల్లడించిందని, అయితే ఆ సంస్థకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 8.50 కోట్ల రూపాయల ప్యాకేజీని చెల్లిస్తుండడం వల్లే తమ పార్టీ ఇమేజ్ ను దేశంలో పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news