తారకా మజాకా.. RRRలో ఎన్టీఆర్ నటనకు జపాన్ మంత్రి ఫిదా

-

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్​ నటనకు మరో అంతర్జాతీయ ప్రముఖుడు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్​ను ఉద్దేశిస్తూ.. జపాన్‌ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి యోషిమాసా హయాషి ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమన్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన యోషిమాసా హయాషి తాజాగా మీడియాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు.

భారతీయ సినిమాలకు తమ దేశంలో మంచి గుర్తింపు వస్తోందని యోషిమాసా అన్నారు. ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను జపాన్‌ ప్రజలు ఎంతగానో అభిమానించారని చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మీకు ఏ హీరో నచ్చారు?’ అని విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘రామారావు జూనియర్‌ నా అభిమాన హీరో’’ అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ పాత్రలతో ఫిక్షనల్‌ కథగా రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news