సీఎం జగన్ సింహం కాదు…చిట్టెలుక – వైసీపీ ఎంపీ సంచలనం

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అనీ, రాజధాని ఫైల్స్ సినిమాకు సింహం జంకిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. గంగ చంద్రముఖిగా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిలు వస్తారని జగన్ మోహన్ రెడ్డి గారు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రముఖి అంత బ్యాడ్ క్యారెక్టర్ ఏమీ కాదమ్మా… అంటూ సెటైర్లు వేశారు. బహుశా ఆ విషయం జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియక పోవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమానే కాకుండా ఇంకా చాలా సినిమాలు రావచ్చునని, ఓటీటీలో కూడా బాబాయ్ అనే సినిమా కూడా వస్తుందట అని అన్నారు. రాజధాని సినిమా దర్శకుడు భాను, నిర్మాత కంఠంనేని రవిశంకర్ గారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజధాని ఫైల్స్ సినిమాను మనసున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news