నరసాపురం TDP ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు టీడీపీతో అన్ని చర్చలు జరిపారట రఘురామకృష్ణంరాజు. రెండు రోజుల్లోనే టీడీపీలో చేరబోతున్నారట రఘురామకృష్ణంరాజు. దీంతో నరసాపురం TDP ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా..హనుమ విహారి ఎపిసోడ్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి టెస్ట్ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించిన హనుమ విహారిని ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గా తప్పించాలని తిరుపతి పట్టణానికి చెందిన ఒక కార్పోరేటర్ చేసిన ఒత్తిడితో దిక్కుమాలిన రాజకీయాలకు ఆయన బలయ్యారని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా తిరుపతి పట్టణానికి చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, 17వ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ లోకి సాధారణంగా వెళ్లరని, అయితే ఆంధ్ర రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ తనయుడు ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లడంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హనుమ విహారి గారు మందలించినట్లు తెలిసిందని వెల్లడించారు.