భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్

-

లైఫ్లో ఒక్కసారైనా దుబాయ్ వెళ్లాలని అనుకోని వారుండరు. దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, ఎడారిలో సఫారీ టూర్కు ఒక్కసారైనా వెళ్లాలనుకుంటారు. అలా దుబాయ్ను సందర్శించాలనుకునే వారికి ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌తో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక వీసా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘మల్టిపుల్‌ ఎంట్రీ ట్రావెల్‌ వీసా’ పేరిట దుబాయ్తో పాటు గల్ఫ్‌ దేశాలకు కూడా ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు దుబాయ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ టూరిజం (డీఈటీ) వెల్లడించింది.

తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త విధానం ద్వారా భారతీయులు పర్యాటక వీసా ద్వారా దుబాయ్‌కు అయిదేళ్ల వ్యవధిలో పలుమార్లు వెళ్లి రావచ్చని డీఈటీ తెలిపింది. ఒకసారి వెళితే 90 రోజులపాటు అక్కడ ఉండవచ్చని వెల్లడించింది. ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులకు మించకుండా ఉండాలని పేర్కొంది. ఈ వీసా దరఖాస్తు ప్రక్రియను కేవలం రెండు నుంచి అయిదు పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఈ వీసాకు అర్హులైనవారు గత ఆరు నెలల్లో బ్యాంకు ఖాతాలో 4,000 డాలర్లు (రూ.3.32 లక్షలు) లేదా అంతకు సమానమైన విదేమారకద్రవ్యం ఉండాలని, యూఏఈలో చెల్లుబాటయ్యేలా ఆరోగ్యబీమా తప్పనిసరిగా ఉండాలని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news