ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఈరోజు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి, ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, వచ్చే 12 గంటల్లో బాగా గుర్తించబడి, తర్వాతి 24 గంటల్లో వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాములో దిగువ ట్రోపో ఆవరణములో పడమర గాలులు వీస్తున్నాయి.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు :—
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఈ రోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఈ రోజు మరియు రేపు ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.ఈ రోజు మరియు రేపు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచును.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమ :-ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.