TSPSC పేపర్ లీక్ కేసు.. మరో 13 మంది డీబార్

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇటీవలే 37 మంది డీబార్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మరో 13 మందిని డీబార్ చేసింది టీఎస్పీఎస్సీ. దీంతో ఈ కేసులో డీబార్ల సంఖ్య 50కి చేరింది. తమ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులో ప్రమేయమున్న వారు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యంతరం ఉంటే రెండు రోజుల్లోగా తెలపాలని తాజాగా అరెస్ట్ అయిన డీఈ రమేష్ సహా 13 మందికి టీఎస్​పీఎస్సీ నోటీసు ఇచ్చింది. ఆ 13 మంది వివరాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్​లో పొందుపరిచింది.

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజి కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తున్న అంశం తెలిసిందే. తాజాగా అరెస్ట్ అయిన డీఈ రమేష్​ను విచారించగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. కేవలం ఏఈ పేపర్లు విక్రయించడం ద్వారా డీఈ రమేష్‌ 1.1కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 30 మందికి అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్లు విక్రయించినట్లు సిట్‌ గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version