నియోజకవర్గ ఇన్చార్జ్ ల మార్పు వైసీపీలో కాక పుట్టిస్తోంది. అసంతృప్తులకు సర్ది చెబుతూ మరిన్ని మార్పులకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ ను రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనీ సూచించిందట.
ఈసారి ఎంపీ సీటుకు మరో బీసీ నేతను నియమిస్తారని సమాచారం. అలాగే ఏలూరు ఎంపీ శ్రీధర్ తాను పోటీ చేయనని చెప్పడంతో మరో నేతకు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఏలూరు ఎంపీ టికెట్ కూడా మరో వ్యక్తికి ఇచ్చే ఛాన్స్ ఉంది.
అంతేకాదు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కని పరిస్థితి నెలకొంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టిక్కెట్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణాలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పట్నుంచే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రజామోదం లేనివారికి టిక్కెట్స్ ఇచ్చేది లేదని ఈ ఇంచార్జుల మార్పు ద్వారా స్పష్టం చేస్తున్నారు.