Rajahmundry Railway Station: రాజమండ్రి రైల్వే స్టేషన్ కు మహర్దశ..రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునర్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. ఇందులో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
అనంతరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ…. రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు 2027 జనవరి నాటికే రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయమని కోరామని చెప్పారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ను తూర్పు వైపున కూడా అభివృద్ధి చేయమని అడిగాము… సనుకుల వాతావరణంలో రైల్వే అధికారులతో సమావేశం జరిగిందని అన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ సమస్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు… కొవ్వూరు, అనపర్తి స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరామని వివరించారు.