బీఎస్‌ఎన్‌ఎల్ కు పెరుగుతున్న ఆదరణ.. 31 రోజుల్లో 2.17 లక్షల కొత్త కనెక్షన్లు

-

ఏపీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ కనెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. జులై నెలలోనే రికార్డు స్థాయిలో 2.17 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో ఆ సంస్థకు చెందిన మొత్తం కనెక్షన్ల సంఖ్య 40 లక్షలకు చేరింది. ఇటీవల పలు ప్రైవేట్‌ టెలికాం సంస్థలు మొబైల్‌ ఛార్జీలను (టారీఫ్‌) పెంచడం.. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానుండటంతో వినియోగదారులు ఈ సంస్థపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త మొబైల్‌ కనెక్షన్లు (సిమ్‌ కార్డులు) తీసుకుంటున్నారు.

4జీ టెక్నాలజీ సేవలు ఆగస్టు 15 నాటికి ప్రధాన నగరాల్లో, సెప్టెంబరు నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. యాంటినాలు, బేస్‌ ట్రాన్సివర్‌ స్టేషన్లు (బీటీఎస్‌), కోర్‌ నెట్‌వర్క్‌ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. 4జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఖాతాదారులు 2జీ నుంచి 4జీలోకి మారే అవకాశం కల్పిస్తున్నారు. వినియోగదారులు సిమ్‌ కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం ద్వారా 4జీ సేవలు పొందగలరని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news