ఏపీకి కేంద్రం మరో శుభవార్త…ఏపీ రోడ్లపై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. మహానాడు రోడ్ నుంచి నిడమానూరు వరకు ఆరు లైన్ల ఫ్లై ఓవర్ కు అనుమతి ఇచ్చారని…. రూ. 800 కోట్లతో రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాబోతున్నాయని పేర్కొన్నారు. రూ. 2500 కోట్లతో తూర్పు బైపాస్ కు కూడా త్వరలో పరిపాలనా అనుమతులు రాబోతున్నాయన్నారు.
రేడియల్ రోడ్లను కూడా ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. అమరావతికి రైల్వే లైన్ రావడం సంతోషమన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం అంటూ కొనియాడారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ. 15వేల కోట్లు కేంద్రం అందించిందన్నారు బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని… విజయవాడ వాసులు ఎదుర్కుంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కూటమి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు.