సాయంత్రంలోపు పిన్నెల్లిని అరెస్ట్ చేయండి అంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్దం చేసింది పోలీస్ శాఖ. అయితే.. ఈ తరుణంలోనే… మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హైదరాబాద్ నుంచి గోవా లేదా ముంబై పారిపోయేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఆయన స్కెచ్ వేశారట.
అందుకే పిన్నెల్లి వాహనాలు NH 65 హైదరాబాద్- ముంబై నేషనల్ హైవేపై ప్రయాణించినట్లు తెలుస్తోంది.. ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రుద్రారం వద్ద ఎమ్మెల్యే కారుని పట్టుకునేందుకు పోలీసుల ప్రయతించినట్టు సమాచారం.