చంద్రబాబు నాయుడు అరెస్ట్ అందరికీ తెలిసిన విషయమే. బాబు అరెస్టు తర్వాత టిడిపి నాయకుడు ఎవరో పార్టీని నడిపించేది ఎవరో తెలియక టిడిపి నేతలు, కార్యకర్తలు ఆలోచనలో ఉన్నారు. అయితే లోకేష్-బాలయ్య లీడ్ తీసుకున్నారు..కానీ అనుకున్న విధంగా పార్టీ వ్యూహరచనలు చేయడం లేదు. అయితే అటు బాబు అరెస్టుకు నిరసనగా టిడిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ పోరాడుతూనే ఉన్నారు. క్రింది స్థాయి సామాన్య కార్యకర్త కూడా చంద్రబాబు అరెస్టుకు తమ నిరసన తెలుపుతున్నారు.
కానీ బాబు ఉండగా పదవులు పొంది అధికారంలో ఉన్న కొందరు నాయకులు తప్పుకు తిరుగుతున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ, లోకేష్ కు సపోర్ట్ గా ఉండాల్సిన నేతలు ఇప్పుడు తమకు ఎందుకులే అనే ధోరణిలో ఉన్నారు . ఆ కీలక నేతలందరూ చంద్రబాబు నాయుడు నుండి భారీగా లబ్ధి పొందిన వారే. చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా జనసేన , కమ్యూనిస్టు పార్టీలు కూడా నిలబడ్డాయి. కానీ టిడిపి పార్టీ నేతలే మౌనంగా ఉండడం టిడిపి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.
ఇన్నాళ్లు మేమే నాయకులమంటూ చంద్రబాబు నాయుడు ఎదుట ప్రగల్బాలు పలికి తమ గొప్పలు చెప్పుకున్న మహా నాయకులందరూ చంద్రబాబు అరెస్ట్ తర్వాత మొహం చాటేస్తున్నారు. ఏదో మొక్కుబడిగానే కొందరు నేతలు హడావిడి చేస్తున్నారు. ఇళ్లకే పరిమితమవుతూ హౌస్ అరెస్ట్‌లు అవుతున్నారు. అయితే ఇప్పటికే బయటకొచ్చి హడావిడి చేయడం, కార్యకర్తలని వెంటేసుకుని తిరగడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు, అలాగే వైసీపీ కేసులు పెడితే ఇరుక్కోవాలని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు బయటకు రావడం లేదు. దీని వల్ల టిడిపికి నష్టం జరుగుతుంది.