ప్రతీ రంగంలో రామోజీ రావు నెం.1 గా ఎదిగారు : చంద్రబాబు

-

రామోజీ రావును ఎంచుకున్న ప్రతీ రంగంలోనూ రామోజీరావు నెంబర్ వన్ గా ఎదిగారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ శివారులోని కానురులోని అనుమోలు గార్డెన్స్ లో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఎన్టీఆర్, రామోజీరావును ఎవ్వరూ అధిగమించలేరని పేర్కొన్నారు.  ఆయన ఓ అక్షర శిఖరమన్నారు. నీతి నిజాయితీకి ప్రతిరూపమని కొనియాడారు. ప్రజాహితమే లక్ష్యంగా ఆయన పనిచేశారని పేర్కొన్నారు.

రామోజీరావు వ్యక్తికాదు. ఓ వ్యవస్థ. ఏ పనిచేసినా.. ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారు. నీతి, నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు. మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్ వన్ గా ఎదిగారు. 1974 ఆగస్టు 10న ‘ఈనాడు’ పత్రిక విశాఖలో ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా ‘ఈనాడు’ అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తోంది. రామోజీరావు పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ప్రస్తావించారు. ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చారు. మీడియా రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. మార్గదర్శి సంస్థను దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఏం చేసినా ఆ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news