కేంద్ర ప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి బహూబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్ చేశారు.ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావుకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడలోని కానూరు అనుమోలు గార్డెన్స్‌లో రామోజీ రావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. రామోజీ రావు.. ఎన్నో శిఖరాలు అధిరోహించారని ప్రశంసల జల్లు కురిపించారు .

తెలుగు ప్రజలకు ఇంత సేవ చేసిన రామోజీ రావుకు మనమేం చేయగలమని భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో మందికి జీవనాధారం కల్పించిన రామోజీ రావుకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం సముచితం, సబబు అని రాజమౌళి అన్నారు.సంస్మరణ సభ వేదికగా రామోజీ రావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news