చలో మాచర్ల కు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ

-

తెలుగుదేశం పార్టీ నేతలు ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గం లో వైసీపీ నాయకుల దాడిలో గాయాల పాలైన తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు.

Telugu Desam Party called Chalo Macherla

ఉదయం 9 గంటలకు గుంటూరు లోని మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్ళనున్నారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొంటారు.

కాగా,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈవీఎంలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆగ్రహంతో ఈవీఎం సెంటర్లోకి ఎంటర్ అయిన.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… నేలకేసి ఈవీఎంలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో వైరల్ కాగానే పారిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం హైదరాబాదులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాక్కున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news