స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిసిన రెబల్‌ ఎమ్మెల్యేలు..!

-

సీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెట్టి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ ఉండగా జనసేన రెబెల్ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు.

స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు..పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు చూపాలని కోరారు. చట్టవిరుద్ధంగా అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని కోటంరెడ్డి స్పీకర్‌ ఎదుట ప్రస్తావించారు. మరోవైపు తనకు ఆరోగ్యం సరిగాలేకపోయినా నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు ఉండవల్లి శ్రీదేవి. మరోవైపు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు అనర్హతపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు వివరణ పూర్తి కావడంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఓటమిభయంతోనే అధికారపార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. సమాచారం ఇవ్వకుండా వాట్సాప్‌లో నోటీసులు పంపారని, ఇప్పుడు సమయం ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. మరోవైపు స్పీకర్‌ను సమయం అడిగాము..ఆయన ఏం చేస్తారో చూడాలంటున్నారు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news