“అసని” తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది సర్కార్. అసని తుఫాన్ దూసుకొస్తున్న తరుణంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు హోంమంత్రి తానేటి వనిత.
సహాయక చర్యల్లో భాగంగా SDRF, NDRF బృందాలను సిద్ధం చేసినట్లు హోంమంత్రి కి తెలిపారు డైరెక్టర్ అంబేద్కర్. అసని తీవ్ర తుఫాను గా మారుతున్న తరుణంలో అధికారులందరూ అలెర్ట్ గా ఉండాలని ఆదేశించిన హోం మినిస్టర్… తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. మత్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్న హోంమంత్రి తానేటి వనిత. తీరప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.