జగన్‌…ఆశయం కోసం పోరాడే పులి..దమ్మున్న లీడర్‌ – రోజా

-

వైసిపి ప్లీనరీ సమావేశంలో మంత్రి రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసిపి జెండాలో పోరాటo, పౌరుషం ఉందని రోజా పేర్కొన్నారు. వైసీపీ జెండా ఎప్పుడు తలెత్తుకుని ఎగురుతూనే ఉంటుందని చెప్పారు. సోనియానే గడగడ లాడించిన పార్టీ వైసిపి అని.. రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వివరించారు.

ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడు వైఎస్ అని… ఆశయం కోసం పోరాడే పులి జగన్ అని కొనియాడారు మంత్రి రోజా. వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు జగన్ అని… అమ్మను మించిన దైవం లేదంటారన్నారు. ఏపీలో జగన్ను మించిన దైర్యం లేదని… జగన్ పాదంలో మహిళల రక్షణకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ప్రేమించే నాయకుడు ఎటు అడుగు వేస్తే అటు వేస్తారన్నారు మంత్రి రోజు.

Read more RELATED
Recommended to you

Latest news