“రాజన్న మనకు ఇచ్చిన గిఫ్ట్ జగనన్న” జగనన్న సురక్ష పథకంతో సమస్యలన్నీ పరిష్కారం అని… మొత్తం “జగనన్న సురక్ష” ద్వారా 11 సేవలు ఉచితం అందిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. రాజన్న వెళ్లిపోయిన తర్వాత ఇక మన బతుకులు ఎలా మారుతాయి, మన జీవితం ఎలా ముందుకు నడవాలి అనుకున్న వాళ్లందరికీ జగనన్న `నేను ఉన్నాను, నేను విన్నాను, నేనున్నాను..` అంటూ అన్ని సమస్యల పరిస్కారం కోసమే జగనన్న_సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారన్నారు రోజా.
“ మీ అందరి ఆశీస్సులు మన సిఎం జగన్ కు ఎప్పుడు ఉండాలి ఎందుకంటే అన్న బాగుంటే మన కుటుంబాలు బాగుంటుంది, మన జగనన్న మహిళా సాధికారత దిశగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆర్థికంగా ఎదిగే విధంగా మీ పిల్లలు చక్కగా చదువుకుని మంచి స్థాయిలో ఉండే విధంగా సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంతటి మనసున్న ముఖ్యమంత్రి లేడని ఈరొజు పక్క రాష్ట్రాలు అనుకుంటున్నయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాట మార్చకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న నాయకుడు మన జగనన్న. గతంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే, ఇల్లు కావాలంటే, పెన్షన్ కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగిన విషయం మీకు గుర్తువుడే ఉంటుందని తెలిపారు రోజా.