2024 ఎన్నికల్లో సమాధుల్లోనే టిడిపిని పూడ్చేస్తారు – మంత్రి రోజా

-

2024 అసెంబ్లీ ఎన్నికల్లో సమాధుల్లోనే టిడిపిని పూడ్చేస్తారని హాట్‌ కామెంట్స్‌ చేశారు ఏపీ మంత్రి రోజా. ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూములను నిరుపేదలకు అందించడాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించారు.

నిరుపేదల జీవితాలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదని.. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడమేంటి..? అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టిడిపిని ప్రజలు పూడ్చేస్తారు.. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావేనని ప్రకటించారు మంత్రి రోజా. వాలంటీర్ల వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారు… వాలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వెల్లడించారు ఏపీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version