ఈ రోజు గన్నవరంలో పార్టీ కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార పార్టీ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించారు. అందులోనూ పేదల ఇళ్ల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన పీఎం ఆవాస యోజన పధకాన్ని మార్చుకుని మరీ నిధులను స్వాహా చేశారని విమర్శించారు. ఇది మేము ఎప్పటి నుండో చెబుతూనే ఉన్నాము, వైసీపీ ప్రభుత్వంలో ఆలా జరగకపోతే వివరాలను బయటపెట్టాలని సోము వీర్రాజు ఛాలెంజ్ విసిరారు. ఇక పేదల ఇళ్ల కోసం భూములను కొనుగోలు చేయడంలోనూ రూ. వేల కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ భాగోతాన్ని బట్టబయలు చేశారు.
కేంద్రం నిధులను వైసీపీ దారి మళ్లించింది: సోము వీర్రాజు
-