వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చిందంటూ వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని.. వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని ఆగ్రహించారు రోజా. తిరుపతిలో ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ పేరు షర్మిల వాడుకుంటోందని ఆగ్రహించారు.
వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని నిప్పులు చెరిగారు మంత్రి రోజా. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా లేకుండా ఏపీని విభజించిన కాంగ్రెసులో, వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినా పార్టీ షర్మిల చేరి జగన్ పైన, నాపై విషం చిమ్ముతోందని ఆగ్రహించారు. షర్మిల కాంగ్రెసు చేరి వైఎస్ఆర్ ఆత్మక్షోభించే విధంగా చేసిందని చురకలు అంటించారు మంత్రి రోజా. వైఎస్ ఆర్ కు, ఆయన ఆశయాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమేనన్నారు మంత్రి రోజా.