లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ వివిధ కమిటీలను నియమించింది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన బీజేపీ.. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం 35పైగా కమిటీలు వేసింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ బాధ్యత చేపట్టనున్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ వేసిన కమిటీలు ఇవే
ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బీజేపీఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా లక్ష్మణ్
కో-కన్వీనర్‌లుగా ఏవీఎన్ రెడ్డి, గరికపాటి, రామచందర్‌రావు
ఎన్నికల కార్యాలయం ప్రముఖ్‌గా రంగారెడ్డి, సమప్రముఖ్‌గా మాధవి
బీజేపీ మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్‌గా లక్ష్మణ్
బీజేపీ ఛార్జిషీట్ కమిటీ ప్రముఖ్‌గా మురళీధర్‌రావు
బీజేపీమీడియా కమిటీ ప్రముఖ్‌గా కృష్ణసాగర్‌రావు
బీజేపీ మీడియా రిలేషన్స్ కమిటీ ప్రముఖ్‌గా ప్రకాష్‌రెడ్డి
బీజేపీ సోషల్ మీడియా కమిటీ ప్రముఖ్‌గా పోరెడ్డి కిషోర్‌రెడ్డి
బీజేపీ ఎన్నికల కమిషన్, లీగల్ ఇష్యూస్ కమిటీ ప్రముఖ్‌గా ఆంథోనీరెడ్డి