వివేకానంద కేసుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా లేకపోతే ఎవరినైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని.. అవినాష్ కేసు విషయంలో ఇవాళ జస్టిస్ లక్ష్మన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అని చురకలు అంటించారు. అవినాష్ కు వ్యతిరేకంగా ఆరోపణలు తప్ప సాక్ష్యాలు లేవని నేడు హైకోర్టు చెప్పిందని..చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని ఎద్దేవా చేశారు రోజా.
ఇకనైనా జగన్, భారతి లపై ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. అవినాష్ తప్పు చేసి ఉంటే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు చర్య తీసుకోలేదు..ఉద్దేశపూర్వకంగానే సౌమ్యుడు అయిన అవినాష్ ను టార్గెట్ చేశారని నిప్పులు చెరిగారు. టిడిపి మేనిఫెస్టో లో ఉన్న వాటిలో మూడు వైసిపివి, కర్ణాటక కాంగ్రెస్ నుంచి రెండు, అలాగే కర్ణాటక బిజెపి నుంచి ఒక పథకాన్ని కాపీ కొట్టారని ఆగ్రహించారు రోజా. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే నాలుగేళ్ల జగన్ పాలన కొనసాగిందని ధీమా వ్యక్తం చేశారు.